చిట్కూల్‌లో 89.6 శాతం ఓటింగ్ నమోదు..!
MDK: చిలిపిచేడ్ మండలం చిట్కూల్ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. గ్రామంలో మొత్తం 89.6% ఓటింగ్ శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు.