సాగర్‌ జలాలతో జిల్లాకు జలకళ

సాగర్‌ జలాలతో జిల్లాకు జలకళ

ప్రకాశం: వానలు, సమృద్ధిగా వస్తున్న సాగర్‌ జలాలతో జిల్లా జలకళను సంతరించుకుంది. పశ్చిమంలో ప్రత్యేకించి నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో వాగులు, వంకలు వర్షపు నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. తూర్పుప్రాంతంలోని గుండ్లకమ్మ, రామతీర్థం రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. సాధారణంగా ఈ తరహా వాతావరణం సెప్టెంబరు ఆఖరు నుంచి కనిపిస్తుంది. అలాంటిది ఈ ఏడాది ఆగస్టులోనే నెలకొంది.