VIDEO: ఘనంగా రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం
MDK: మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఐదో వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. వార్షికోత్సవ వేడుకలలో గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ పూజ కార్యక్రమాలను జరిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులతో పాటు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.