ALERT: 15 తర్వాత ఆ ఖాతాలు క్లోజ్!

ALERT: 15 తర్వాత ఆ ఖాతాలు క్లోజ్!

పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లకు ఆ బ్యాంకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మూడేళ్లుగా లావాదేవీలు జరపని ఖాతాలు, జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ల‌ను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 16వ తేదీ నుంచి ట్రాన్సాక్షన్ జరగని ఖాతాలను క్లోజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వినియోగదారులు తమ అకౌంట్లు కొనసాగించాలని అనుకుంటే ఈనెల 15లోపు KYC అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.