కర్మన్ ఘాట్‌లో పర్యటించిన ఎల్బీనగర్ జోనల్ కమిషనర్
RR: ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కర్మన్‌ఘాట్ వార్డులోని శుభోదయ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రయాణం సాఫీగా సాగే సౌకర్యాన్ని అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.