డీఈవో ఆకస్మిక తనిఖీ

డీఈవో ఆకస్మిక తనిఖీ

NLG: చిట్యాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను డీఈవో బిక్షపతి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. శుభ్రతను పాటిస్తూ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని వంట ఏజెన్సీలకు సూచించారు. నిబంధనల ప్రకారం పాఠశాల సిబ్బంది విధులు నిర్వహించాలని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎంఈవో సైదా నాయక్, హెచ్ఎం మాధవి, ఉపాధ్యాయులు ఆయనతో ఉన్నారు.