VIDEO: ప్రమాదకరంగా మారిన భద్రకాళి ఆలయం రోడ్డు
WGL: పట్టణ కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. గుంతలు, చీకటి, లైట్లు లేకపోవడంతో వాహనదారులు, భక్తులు భయపడుతూ ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఒక్క అడుగు ముందుకు వేయడమే కష్టంగా ఉంటోంది. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని గ్రేటర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.