CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NTR: విజయవాడ కృష్ణలంకలోని టీడీపీ కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు రూ.36,64,880 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సోమవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వైద్య సహాయనిధి ద్వారా అనేక మంది చికిత్స ఖర్చుల నుంచి ఉపశమనాన్ని పొందుతారన్నారు.