'అన్ని సమస్యలను పరిష్కరిస్తాం'

'అన్ని సమస్యలను పరిష్కరిస్తాం'

MNCL: అన్ని వార్డులలో సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని లక్షెట్టిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ దొంత అంజలి నర్సయ్య తెలిపారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులను, పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు తోట సువర్ణ, వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి ఉన్నారు.