ఇల్లందు ఏరియాలో 62 శాతం బొగ్గు ఉత్పత్తి

BDK: సింగరేణి ఇల్లందు ఏరియా జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన పత్రిక సమీక్షా సమావేశంలో జూలై నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఏరియా జీయం వి.కృష్ణయ్య తెలిపారు. జూలై-2025 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 2.13 లక్షల టన్నులకు గాను, 1.33 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 62 శాతం ఉత్పత్తి చేసినట్లు తెలిపారు.