'నష్టపోయిన వారిని ఆదుకోవాలి'
WGL: పర్వతగిరి మండల ముదిరాజ్ సంఘం నాయకులు మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోంథా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాల వివరాలను సమర్పించారు. మండల అధ్యక్షుడు రావుల రాజు, జిల్లా డైరెక్టర్ అల్లాడి నరసయ్య నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ఎమ్మెల్యేకు తెలియజేసి వారిన ఆదుకోవాలని కోరారు.