హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: మాజీ ఎమ్మెల్యే

హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: మాజీ ఎమ్మెల్యే

SRD: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఖేడ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును 'కూలేశ్వరం' అని ఎగతాళి చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు అర్థరహితమన్నారు.