పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ
BPT: పోలీస్ సిబ్బంది కుటుంబాలకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బాపట్ల SP ఉమామహేశ్వర్ అన్నారు. ఇటీవల హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గుండె పోటుతో మృతి చెందారు. దీంతో బుధవారం ఆయన కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ రూ.లక్ష చెక్కును ఆయన పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంకితభావంతో విధులు నిర్వహించే సిబ్బంది మృతి చెందటం బాధాకరమన్నారు.