చేవెళ్ల రోడ్డు ప్రమాదం బాధకరం: స్పీకర్
VKB: యాక్సిడెంట్ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల మండల సమీపంలో చోటుచేసుకున్న యాక్సిడెంట్ స్థలాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రభుత్వపరంగా మృతిచేందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.