VIDEO: పెనుకొండలో సీపీఎం నాయకులు ధర్నా

VIDEO: పెనుకొండలో సీపీఎం నాయకులు ధర్నా

సత్యసాయి: పెనుకొండలో అంగన్వాడీ వర్కర్లు, సీపీఎం నాయకులు మంగళవారం రోడ్డుపై ధర్నా చేపట్టారు. అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.