'భావన్నారాయణస్వామి ఆలయ భూములకు రీ-సర్వే'
కాకినాడ రూరల్ సర్పవరంలోని శ్రీ భావన్నారాయణ స్వామి దేవస్థానానికి చెందిన ఆలయ భూములను జిల్లా ఎండోమెంట్ అధికారి నాగేశ్వరరావు బుధవారం తనిఖీ చేశారు. ఇటీవల కొంత భూమి కబ్జాకు గురైన నేపథ్యంలో, భూముల పరిరక్షణలో భాగంగా రీ-సర్వేకు ఆదేశించినట్లు ఈవో ఆర్. శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సర్వే జరుగుతున్నందున డీఈవో నాగేశ్వరరావు పరిశీలనకు వచ్చినట్లు వివరించారు.