పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పటేల్ రమేష్ రెడ్డి ప్రచారం
SRPT: సూర్యాపేట మండలం టేకుమట్లలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి గట్టు జ్యోతి–శ్రీనివాస్‌కు మద్దతుగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రజలను ఉంగరం గుర్తుకు ఓటేయాలని కోరారు. గ్రామాభివృద్ధి, పేదల సంక్షేమం, వసతుల పెంపు, యువత ఉపాధి వంటి అంశాల్లో కాంగ్రెస్ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.