VIDEO: వర్ష ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన కలెక్టర్

MDK: జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. గురువారం మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలన చేశారు. మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నీరు చేరడంతో అధికారులతో కలిసి పరిశీలన చేశారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహం వద్దకు వెళ్ళవద్దని సూచించారు.