VIDEO: నిమ్మకూరుకు చేరుకున్న మాజీ సీఎం జగన్
కృష్ణా: తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన మాజీ సీఎం జగన్ పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు గ్రామానికి ఇవాళ చేరుకున్నారు. స్థానిక ప్రజలు, రైతులు, మహిళలు, యువత భారీ గజమాలతో మాజీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 'సీఎం.. సీఎం' అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.