విద్యకే తొలి ప్రాధాన్యత: ఎమ్మెల్యే
MBNR: విద్యారంగానికే తాను అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నానని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని టీడీ గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఆయన తన సొంత నిధులతో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూ ఆర్ కోడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ శనివారం పంపిణీ చేశారు. పాఠశాలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.