వెంకటరెడ్డి కృషి చిరస్మరణీయం: కలెక్టర్

వెంకటరెడ్డి కృషి చిరస్మరణీయం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఆనంద్, JC విష్ణుచరణ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, విద్య, ఆత్మగౌరవం పెంపొందించడానికి వెంకటరెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.