సదాశివనగర్‌లో 20.96% పోలింగ్ నమోదు
KMR: సదాశివనగర్ మండలంలోని 21 గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతుంది. ఆయా గ్రామాల్లో 31453 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. 21 గ్రామాల్లో 6593 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలో ఉదయం 9 గంటల వరకు 20.96% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.