క్రికెటర్ శ్రీచరణికి భారీ నజరానా

క్రికెటర్ శ్రీచరణికి  భారీ నజరానా

GNTR: ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన కడప క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని అందించింది. బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఆమెకు రూ.2.5 కోట్ల నగదు చెక్కును స్వయంగా అందజేశారు. ఈ నగదుతో పాటు విశాఖపట్నంలో 500 గజాల నివాస స్థలం, ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నేరుగా గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.