ఉప్పుగల్లు ఆకేరు వాగులో అక్రమ మట్టి తవ్వకాలు
JN: జఫర్గడ్ మండలం ఉప్పుగల్లులోని ఆకేరు వాగులో జేసీబీతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్విన మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించడం స్థానికుల్లో ఆందోళన సృష్టిస్తోంది. వాగు సహజ ప్రవాహం దెబ్బతినే ప్రమాదం ఉందని, వర్షాకాలంలో సమీప వ్యవసాయ భూములకు నష్టం కలగవచ్చని రైతులు చెబుతున్నారు. గనుల శాఖ వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.