కాశి విశ్వేశ్వరుడిని దర్శించుకున్న భువనేశ్వరి

కాశి విశ్వేశ్వరుడిని దర్శించుకున్న భువనేశ్వరి

CTR: రామకుప్పంలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుడిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఆమెకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుని బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.