మైనర్లు బైకులు నడిపితే కేసులు: ఎస్సై

మైనర్లు బైకులు నడిపితే కేసులు: ఎస్సై

KDP: మైనర్లు బైకులు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని చిట్వేలు ఎస్సై రఘురాం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మైనర్లు బైక్ రైడింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చట్టాన్ని అతిక్రమించిన మైనర్లు, తల్లిదండ్రులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇటీవల జరిగిన తనిఖీలలో మోటార్ బైకులు నడుపుతున్న మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.