లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఆదరణ కరువు.!

లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఆదరణ కరువు.!

ADB: జైనథ్ మండల కేంద్రంలో నెలకొన్న ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఆదరణ కరువైంది. ఏకశిలా నల్లరాతి శిల్పంతో నిర్మితమైన జైనుల కాలం నాటి ఈ ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు సరిగా లేవని గ్రామస్తులు అన్నారు. ఆలయానికి పక్కనే ఉన్న కోనేరు సైతం నిరుపయోగంగా ఉందని భక్తులు వాపోయారు. ఇకనైనా పాలకులు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.