'కుక్కల బెడద నుంచి కాపాడండి'

'కుక్కల బెడద నుంచి కాపాడండి'

GNTR: కొల్లిపర గ్రామంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కల బెడదతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులపై అవి దాడికి తెగబడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ బజార్, అంబేద్కర్ బొమ్మ సెంటర్, పాల కేంద్రం బజార్లలో కుక్కల బెడద అధికంగా ఉందని పలువురు మహిళలు తెలిపారు.