తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా తగ్గిన వరద

KRNL: తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు చేరుతుంది. ఇన్ ఫ్లో 52,149 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 64,566 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1625.54 అడుగుల వద్దకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 78.272 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.