కాలంరాజుపేటలో 100 పశువులకు చికిత్సలు

VZM: గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 పశువులకు వైద్యురాలు చికిత్సలు జరిపారు. ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు ఈ శిబిరాలు నిర్వహిస్తారని చెప్పారు.