ఇక నుంచి 3 నెలలకు నల్లా బిల్లు..!

ఇక నుంచి 3 నెలలకు నల్లా బిల్లు..!

HYD జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గృహ సముదాయాలకు 3 నెలలకు ఒకసారి నల్లా బిల్లు జారీ చేయనున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. గృహ సముదాయాలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తామని, మూడు నెలలకు కలిపి 60 వేల లీటర్లకు మించితేనే అధిక ఛార్జీలు వసూలు చేస్తామన్నారు. మూడు నెలలకు కలిపి 60 వేల లీటర్ల వరకు రీడింగ్ ఉంటే ZERO BILL రానుంది.