KTRకు BRS నాయకుల ఘన స్వాగతం
NZB: ఆర్మూర్ పట్టణానికి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ ఉదయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు BRS రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ BRS అధ్యక్షుడు పూజా నరేందర్ ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తూ.. ఆయన మార్గమధ్యంలో పెర్కిట్ బైపాస్ వద్ద కొద్దిసేపు ఆగి స్థానిక BRS నాయకులతో ముచ్చటించారు.