మాదివాడ దేవస్థానాల ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం

మాదివాడ దేవస్థానాల ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం

WG: ఆకివీడులోని మాదివాడ శ్రీ మల్లేశ్వర, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఛైర్మన్లుగా బొల్లం సత్యనారాయణ, వెలివల శివ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వి.వెంకటేశ్వరరావు వారి చేత ప్రమాణం చేయించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా స్వామి సేవలో నిమగ్నమవుతామని వారు తెలిపారు. వీరితో పాటు మరో 18 మంది ధర్మకర్తలు ప్రమాణం చేశారు.