60 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం

KRNL: దేవనకోండ మండలం బండగలకట్టు గ్రామంలో సుంకన్న, నాగరాజులు మెగా డీఎస్సీ పరీక్షలో మెరిట్ సాధించి సత్తా చాటారు. గ్రామం నుంచి యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఉద్యోగాలు పోందిన వారిని సన్మానించారు. 120 కుటుంబాలు, 510మంది జనాభా ఉన్నగ్రామంలో 60ఏళ్లలో ఇంతవరకు ఒక్కరు కుడా ప్రభుత్వం ఉద్యోగం పొందలేదని గ్రామస్థులు పేర్కొన్నారు.