ఘనంగా అగ్నిమాపక వారోత్సవాల ముగింపు

ఘనంగా అగ్నిమాపక వారోత్సవాల ముగింపు

KRNL: ఆదోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ ఫైర్ డే, అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రశాంత్ కుమార్, సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. అగ్నిమాపక సిబ్బందికి స్వీట్లు పంచి, ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాసవి క్లబ్ సభ్యులు, అగ్నిమాపక బెటాలియన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.