ఘనంగా మెరకతల్లి అమ్మవారి వారోత్సవాలు
VZM: మెరకముడిదాం, సోమలింగాపురం, ఎంపాలెం మూడు గ్రామాల గ్రామ దేవత మెరకతల్లి అమ్మవారి వారోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈనెల 8, 9,10 తేదీలలో అమ్మవారి వారోత్సవాలు ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ తెలిపింది. చివర రోజైనా మంగళవారం ఎక్కువ మెరకముడిదాం ప్రజలు హాజరై గ్రామ దేవతకు మొక్కలు చెల్లించుకున్నారన్నారు.