టంగుటూరు జాతి రహదారిపై కారు బోల్తా
ప్రకాశం: టంగుటూరు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఒక్కరే ఉన్నారు. హైవే అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని ఒంగోలు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.