టీటీడీకి నకిలీ సిఫారసు లేఖలు.. ఎస్పీకి ఫిర్యాదు
AP: మంత్రి సత్యకుమార్ పేరుతో టీటీడీ దర్శనాలకు సంబంధించిన నకిలీ సిఫారసు లేఖలు జారీ కావడం కలకలం రేపింది. దీనిపై మంత్రి కార్యాలయం విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసింది. టీటీడీ సిఫారసు లేఖల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి భక్తులు మోసపోవద్దని మంత్రి కార్యాలయం సూచించింది. మోసపూరిత వ్యక్తుల గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని పేర్కొంది.