పేకాట స్థావారాలపై దాడి...11 మంది అరెస్ట్..!

పేకాట స్థావారాలపై దాడి...11 మంది అరెస్ట్..!

W.G: తణుకు మండలం దువ్వలోని ఓ ఫంక్షన్ హాలులో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై కె. చంద్రశేఖర్ తెలిపారు. ఫంక్షన్ హాలులో మంగళవారం పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. నిందితుల నుంచి రూ.16,380ల నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.