ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

NLR: అల్లూరు మండలం, ఉలవపాళ్ల రోడ్డులో 11 కె.వి విద్యుత్ లైన్ స్తంభాన్ని ఇటీవల గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో స్తంభం అడుగుభాగం విరిగిపోయి వాలిపోయింది. విద్యుత్ లైన్ ఉండడంతో ప్రమాదం పొంచి ఉందని అటుగా వెళుతున్న వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.