ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: కలెక్టర్

SRD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు లబ్ధిదారులు, అధికారులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు. ఝరాసంగం, న్యాల్‌కాల్ మండల కేంద్రాల్లో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బేస్‌మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు.