‘పౌరులే లక్ష్యంగా ఇరాన్ దాడులు’

‘పౌరులే లక్ష్యంగా ఇరాన్ దాడులు’

పౌర నివాసాలే లక్ష్యంగా ఇరాన్‌ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. అరాద్‌ నగరంలో క్షిపణి దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, సామాన్య పౌరులను చంపడమే ఇరాన్ పాలకుల ఉద్దేశమని మండిపడ్డారు. తాము మాత్రం కేవలం అక్కడి పాలకులు, నేర ముఠాలనే టార్గెట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. తాము ప్రపంచ దేశాల తరఫున పోరాడుతున్నామని నెతన్యాహు పేర్కొన్నారు.