భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు నజరానా
NTR: భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రోత్సాహకంగా భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జట్టుకు రూ.10లక్షల చెక్కును కెప్టెన్ దీపికకు అందజేశారు. ఫైనల్లో కీలక పాత్ర పోషించిన పొంగి కరుణా కుమారికి రూ. లక్షలు, జట్టు కోచ్ అజేయ్ కుమార్ రెడ్డికి ఏసీఏ ప్రదానం చేసింది.