'తలసేమియా రహిత భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేద్దాం'
BDK: ఇల్లందు మండలం రొంపేడు ప్రాథమిక వైద్యశాల సిబ్బంది ఈరోజు వైద్యశాలలో తలసేమియాపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియా వ్యాధి లక్షణాలను వివరిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కవిత, HEO రాజు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. తలసేమియా రహిత భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేద్దాం అని పేర్కొన్నారు.