అధికారుల విధులకు ఆటంకం కల్పిస్తే చర్యలు: SP
VKB: స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. వికారాబాద్ పోలీస్ కేంద్ర కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులందరూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు సభలు, సమావేశాలు ర్యాలీలు నిషేధించామన్నారు.