నాయకుడు ప్రజల మన్ననలు పొందాలి: మాజీ ఎంపీ

ADB: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల మన్ననలు పొందిన వాడే నిజమైన నాయకుడని మాజీ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు శనివారం నిర్వహించారు. సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బాపూరావు మాట్లాడారు. రాజకీయాల్లో గజేందర్ మరింత రాణించాలని ఆకాంక్షించారు.