ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో
MDK: నిజాంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వసంతరావు నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిజిస్టర్లు, ఫార్మసీ స్టోర్‌ను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. NCD లెప్రసీ, TB, ప్రోగ్రాం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని తెలిపారు. ఇందులో డా. అరవింద్, భాస్కర్ తదితరులు ఉన్నారు.