పెళ్లి కోసం వచ్చి విషాదం

పెళ్లి కోసం వచ్చి విషాదం

GDWL: జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన రామానాయుడు హైదరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలనే వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్ల కోసం సెలవు తీసుకుని బుధవారం స్వగ్రామానికి బయలుదేరిన రామానాయుడు, అయిజ మండలం వెంకటాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున కన్నుమూశాడు.