స్కూటీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి

స్కూటీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి

విశాఖలోని రామా టాకీస్ వద్ద స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక ఉన్న మహిళ బస్సు చక్రల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.హైదరాబాద్‌కు చెందిన రోజా రాణి తన అన్నకు ఆపరేషన్ జరిగిందని తెలుసుకొని విశాఖ వచ్చి పరామర్శించి తమ్ముడితో స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందినట్లు సమాచారం. త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.