'యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు'

'యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు'

RR: రాష్ట్రంలో యూరియా కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కేంద్రం నుంచి సరఫరా ఆశించిన స్థాయిలో లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మంచాల మండలం సొసైటీ వద్ద ఉదయం నుంచి క్యూలైన్‌లో నిలబడినా యూరియా దొరుకుతుందని ఆశ కనిపించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను కోరుతున్నారు.